నమస్తే
సంస్కృతం ఈ దేశపు ఆస్తి. మన సంపద. ఆమె పట్ల మనకు అధికారం, బాధ్యత రెండూ ఉన్నవి. భారత దేశపు భూమినుండి ఉదయించి విశ్వానికి అంతటికీ వెలుగులు పంచిన సుందరభాషా రవికిరణం ఆ పరాభట్టారికా. ఈనాడు ఆధునికతా మేఘాచ్ఛన్నమై ఆమె వెలుగులు కృశించినవి. ఆ మేఘాలను చెదరగొట్టే భాషాసేవా మహాఝంఝావాతాల అవసరమెంతో ఉంది.
సంస్కృతం విదేశాలవారు సైతం ఆదరించటం మనకెంతో గర్వకారణం. మన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఆచారాలు, యోగ-ధ్యానం వంటి సన్మార్గాలెన్నో విదేశీయులను చేరాయి. వారు ఎంతో లాభపడి వాటిని ప్రచారం చేస్తున్నారు కూడా. అంతమాత్రాన వారు వాటిని సృష్టించినవారూ కాదు, కాపాడినవారూ కాదు, మహాపోషకులూ కాదు. హిందూధర్మంలోకి పెనవేసుకుపోయిన ఎన్నో గొప్ప సాటిలేని విషయాలన్నిటినీ కుతంత్రాలతో తమవిగా ప్రకటించుకోవటమే కాక పేటెంట్లు చేసేసుకుని వాటిని మనకే చెందనివ్వకుండా చేస్తున్నారు!! "వేదం, ఓంకారం హిందూ కాదు", "యోగాయుర్వేదాదులు హిందూ కాదు", "సంస్కృతం హిందూ కాదు" అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. అవన్నీ హిందూ కాకపోతే వారి తండ్రిగారు చేసారా, వారి తాతగారు చేసారా? ఎన్నో విదేశీ దురాక్రమణలనుండి భద్రంగా కాపాడుకు వచ్చిన మా వరకు అందించిన మా తాతముత్తాతల కష్టఫలితం, పరిశోధనాఫలమది. మా వేలసంవత్సరాల ఆస్తిపాస్తులవి.
లాభపడిన కృతజ్ఞత లేకపోంగా, మూలానికే ఎసరు పెట్టే నికృష్టజాతులు పెరిగిపోయి హిందువులను అడుగడుగునా తిరస్కరిస్తున్నారు. తిన్న కంచంలో ఛిద్రం చేసుకునే దుష్టజనుల సంస్కారహీనుల చేతులలో సంస్కృతం పడటం మనకెంతో అవమానకరం, బాధాకరం.
దానికే ఆజ్యం పోసి ఆ థియరీలనే నిజమని నమ్మటమే కాక ఆ భావాలనే ప్రచారం చేసే మూర్ఖపు వెర్రి ఆధునిక హిందువల బెడద ఈ సమస్యకు రెండవ ఎత్తు. "విదేశాలలోనే ఉన్నది- మన దేశంలో లేనేలేదు సంస్కృతం-" అంటూ వెర్రి మాటలు మాట్లాడేసి కృతఘ్నులు, దుష్టులైనవారి ఉద్దేశ్యాలను సఫలీకృతం చేస్తున్నారు. సంస్కృతాన్ని కాపాడుకోవటానికి సంస్కృతివిషయాల అవగాహన ఎంతో ముఖ్యమైపోయింది. ఆచారాదులనుండి దూరమైన భాష ఈ దుష్టపరిణామాలను ఎడతెరిపి లేకుండా ప్రసారం చేసేస్తున్నది.
అందుకు సమాధానంగా ఈ బ్లాగ్. ఇందులో భారతదేశంలో సంస్కృత విద్యలు, పెద్దలు, పండితులు, విశ్వవిద్యాలయాలు మొదలైనవాటి గురించిన సమాచారం వివిధ మార్గాల ద్వారా సేకరించి పెట్టబడుతున్నది.
అంతా చక్కగ చదివి, ఇక్కడ పెట్టగలిగే మంచి సమాచారం మీ వద్ద ఉందనిపిస్తే తప్పక ఈ మెయిల్ కి వ్రాయమని మనవి- samskrta.usha@gmail.com
సంస్కృతం సంస్కృతేర్మూలమ్. జయతు సంస్కృతమ్.
శుభం భూయాత్
No comments:
Post a Comment